మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటిలో ఒకటి స్టీవియా. దీనినే మధుపత్రి అని కూడా పిలుస్తారు. పేరుకు తగినట్టుగానే ఈ ఆకు రుచిలో తియ్యగా ఉంటుంది.
TV9 Telugu
చక్కెర కంటే ఎక్కువ తియ్యగా ఉండే మధుపత్రి ఆకుల్లో బోలెడన్ని ఔషధ గుణాలు నిండి ఉంటాయి. ఈ ఆకుల పొడి మార్కెట్‌లో, ఆన్ లైన్‌లో విక్రయిస్తుంటారు. చక్కెరకు బదులుగా వాడొచ్చు.
TV9 Telugu
ఆరోగ్య పరంగా మధుపత్రి అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులు పంచదార కంటే 150 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి.
TV9 Telugu
కానీ పంచదార కంటే ఈ ఆకులు ఎంతో మేలైనవి. వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదు. నోటిలో వేసుకుని బాగా నమిలి తినాలి. షుగర్‌కు బదులుగా ఈ ఆకుల రసాన్ని వాడొచ్చు.
TV9 Telugu
100 గ్రాముల స్టీవియా ఆకుల పొడిలో 100 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికి ప్రోటీన్, క్యాలరీలు, ఫైబర్, ఫ్యాట్ వంటి పోషకాలు ఏ మాత్రం ఉండదు.
TV9 Telugu
ఈ ఆకుల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికి అవి గ్లూకోసైడ్ రూపంలో ఉంటాయి. కనుక వీటిని మన ప్రేగులు జీర్ణం చేయలేవు. జీర్ణం అయినప్పటికి మూత్రం ద్వారా బయటకు వస్తాయి.
TV9 Telugu
షుగర్ వ్యాధితో బాధపడే వారు పంచదార, బెల్లం వంటి వాటిని తీసుకోరు.. కనుక అటువంటి వారు ఈ స్టీవియా పౌడర్ ను టీ, కాపీ, లస్సీ, జ్యూస్ వంటి వాటిలో వేసుకోవచ్చు.
TV9 Telugu
శరీరంలో క్యాలరీలు పెరగకుండా జ్యూస్ లను తాగాలనుకునే వారు కూడా మధుపత్రి ఆకులతో తయారు చేసిన పొడిని ఉపయోగించుకోవచ్చు. మంచి ఫలితం ఉంటుంది.
TV9 Telugu
ఈ స్టీవియా పొడిని వాడడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పొడిని వాడడం వల్ల రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ ల బారిన కూడా పడకుండా ఉంటాము.