10 August 2023

స్త్రీలలో బట్టతల ఎందుకు రాదు.. అసలు కారణాలు ఏమిటి?

బట్టతల కేసులు పురుషులలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ స్త్రీలలో ఎందుకు కనిపించవు. కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా?

పురుషుల్లో బట్టతల రావడానికి హర్మోన్‌ కారణం. హర్మోన్‌ స్వయంగా శరీరంలో ఇటువంటి మార్పులను చేస్తుంది. ఇది బట్టతలకు కారణం అవుతుంది

స్త్రీలలో కంటే పురుషులలో టెస్టోస్టిరాన్‌ హర్మోన్‌  స్థాయి ఎక్కువగా ఉండటమే బట్టతలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శరీరంలో టెస్టోస్టిరాన్‌ హర్మోన్‌ స్థాయి పెరిగినప్పుడు డీహెచ్‌టీ హర్మోన్‌ కూడా పెరుగుతుంది. దీంతో జుట్టు మూలాల నుంచి బలహీనపడుతుంది

శరీరంలో డీహెచ్‌టీ స్థాయి పెరగడం వల్ల వెంట్రుకలు కుచించుకుపోతాయి. ఫలితంగా పురుషుల్లో బట్టతల సమస్య పెరుగుతుంది

శరీరంలో డీహెచ్‌టీ స్థాయి ఎక్కువ ఉంటే జుట్టు వేగంగా రాలుతుంది. అందుకే వాటిని అడ్డుకునే ఇలాంటి సప్లమెంట్లను వైద్యులు ఇస్తుంటారు

పురుషులలో బట్టతలకు చాలా సందర్భాలలో ఇది కారణం. కానీ కొన్ని సార్లు పోషకాల లోపం వల్ల కూడా జరగవచ్చు. అందుకే వైద్యుల సలహాలు తీసుకోండి

 బట్టతల వస్తుంటే వైద్యుల సలహాలతో పోషకాలు తీసుకోవాల్సి వస్తుంది. ఏది పడితే అతి తీసుకుంటే బట్టతల ఆగదు. ఇంకా ఎక్కువ అవుతుంది