ప్రతి రైలులాగా.. వందేభారత్ వెనుక X గుర్తు ఎందుకు లేదు?

TV9 Telugu

01 February 2025

భరత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంలో మొదలుపెట్టిన వందేభారత్ ప్రయాణికులను ఆకర్శించింది. దశల వారీగా అన్ని ప్రాంతల్లో పరుగులు పెడుతున్నాయి.

ఇప్పటివరకు సిట్టింగ్ మాత్రమే ఉన్న వీటిలో త్వరలో స్లీపర్ కూడా రానున్నాయి. ఇదిలా ఉంటె వందేభారత్ వెనుక X గుర్తు ఎందుకు లేదు?

దేశంలో ప్రతిరోజూ వేలాది రైళ్లు నడుస్తాయి. వీటి ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఈ రైళ్లన్నింటికీ వెనకాల X గుర్తు ఉంటుంది.

ఒక రకంగా చెప్పాలంటే, ఈ గుర్తు రైల్వేకు కూడా గుర్తింపుగా మారింది. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వెనుక ఈ గుర్తు లేదని మీరు ఎప్పుడైనా గమనించారా?

దీని వెనుక ఉన్న కారణం ఏటంటే.. రైలు భద్రతా కోణం ఒకటి కాగా, రైలు చివరి కంపార్ట్‌మెంట్‌లోని X గుర్తు చాలా ముఖ్యమైనది.

రైలు చివరి కోచ్‌లో ఈ గుర్తు వేస్తారు. తద్వారా స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు రైలు దాటిపోయిందని తెలుసుకోవచ్చు.

ఈ X గుర్తు రైలు వెనుక భాగంలో లేకుంటే, రైలు వెనుక ఉన్న కోచ్‌లు విడిపోయాయనే హెచ్చరిక సిగ్నల్ అవుతుంది.

వందే భారత్‌కు ఈ రకమైన భద్రత అవసరం లేదు. ఎందుకంటే ఈ రైలు పూర్తిగా జోడించి ఉంటుంది. ఇది రెండు దిశలలో నడుస్తుంది.