కొలెస్ట్రాల్‌ను వెన్నలా కరిగించే పండు.. రోజుకొక్కటైనా తినాల్సిందే

18 July 2024

TV9 Telugu

TV9 Telugu

కొలెస్ట్రాల్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్య. నేటి కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు

TV9 Telugu

అలాగే గుండె జబ్బుల సమస్య కూడా నానాటికీ పెరుగిపోతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా.. ఏ వయసువారైనా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది

TV9 Telugu

మన రక్తంలో అధిక కొలెస్ట్రాల్ వీటన్నింటికీ కారణం. ఇది ప్రాథమికంగా అంటుకునే పదార్థం. శరీరంలో మంచి మరియు చెడు అనే 2 రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి

TV9 Telugu

చెడు కొలెస్ట్రాల్ సిరల్లో పెరగడం ప్రారంభించినప్పుడు గుండె సమస్యలే ప్రారంభమవుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉత్తమ మార్గం సాధారణ వ్యాయామం, ఆహారం 

TV9 Telugu

అలాగే రక్తపరీక్షలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని తేలితే వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవడం అస్సలు మరచిపోకూడదు. మందులతో పాటు ఆహారంపై కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి

TV9 Telugu

ఇలాంటి వారికి జామ చాలా మంచిది. రోజువారీ ఆహారంలో జామ పండును తీసుకుంటే కొలెస్ట్రాల్‌ సమస్య ఇట్టే దూరం అవుతుంది. జామలో పీజు పదార్ధం అధికంగా ఉంటుంది

TV9 Telugu

ఇది కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. దానితో పాటు, జామ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది  

TV9 Telugu

కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే ప్రక్రియని జామ నియంత్రిస్తుంది. జామ కాయలు తినడం వల్ల బరువు తగ్గడంతో పాటూ మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది