ముడతలు పడిన చర్మం, నుదురుపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు- ఇవి వృద్ధాప్య చర్మానికి సంకేతాలు. కొబ్బరినూనెతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
చాలా మంది జుట్టుకు కొబ్బరి నూనె రాసుకుంటారు. అయితే ఈ ఆయిల్ చర్మ సంరక్షణను కూడా బలేగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి
TV9 Telugu
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కొబ్బరి నూనె పొడి చర్మాన్ని మృదువుగా చేసి, చర్మ సమస్యలను తగ్గిస్తుంది
TV9 Telugu
కొబ్బరి నూనె చర్మం కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ ప్రొటీన్ చర్మాన్ని బిగుతుగా ఉంచి వృద్ధాప్యాన్ని నివారిస్తుంది
TV9 Telugu
కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మపు మంటను తగ్గించడానికి, చర్మానికి పోషణ అందించడంలో సహాయపడతాయి
TV9 Telugu
రోజూ కొబ్బరినూనెను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ స్థితిస్థాపకత పెరుగుతుంది. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది
TV9 Telugu
చర్మం వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాలనుకుంటే.. యాంటీ ఏజింగ్ క్రీమ్‌లకు బదులు మీ ముఖానికి కొబ్బరి నూనెను రాయడం ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల వేలాది చర్మ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది
TV9 Telugu
రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో ముఖంపై మసాజ్ చేసుకోవాలి. తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తుడుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మీ చర్మం మెరుస్తుంది