మీరూ ఆహారం గబగబా తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి
27 December 2023
TV9 Telugu
చాలామంది ఆహారం సరిగ్గా నమలరు. ఏదో అత్యవసర పని ఉందన్నట్టు హడావిడిగా తినేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోగా ఇతర సమస్యలు వస్తాయి
అందుకే ఆహారం తినడానికి ప్రత్యేకించి ఓ అరగంట సమయం కేటాయించి బాగా నమిలి తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు
అంతేకాకుండా మనం ఎంత తక్కువ సమయంలో ఆహారాన్ని తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువగా బరువు పెరిగే అవకాశాలుంటాయట
అందువల్లనే బరువు తగ్గాలనుకొనే వారు ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినమని నిపుణులు సూచిస్తుంటారు. వేగంగా తినేయడం వల్ల సరిపడినంత తిన్నామన్న భావన కలగదు
దీంతో మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తామట. ఫలితంగా శరీర బరువు కూడా పెరిగిపోయి ఒబేసిటీకి దారి తీస్తుంది.. అదే నిదానంగా ఆహారాన్ని బాగా నమిలి తింటే ఈ సమస్య ఉండదు
ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. పైగా ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల అది పూర్తిగా జీర్ణమై దానిలోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయి
లాలాజలంలో ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైములు ఉంటాయి. అవి ఆహారంతో కలిసిపోయి తక్కువ సమయంలోనే జీర్ణమైపోయేలా చేస్తుంది
గబగబా తినేటప్పుడు దాన్ని సరిగ్గా నమలలేకపోవడం వల్ల అది జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా జీర్ణాశయంలో హానికారక బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం కూడా ఉంది