వారి మృతదేహాలను ఎందుకు భద్రపరుస్తున్నారు..?

TV9 Telugu

29 August 2024

చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను కొన్ని ప్రదేశాల్లో ఎందుకు భద్రపరుస్తున్నారో అనే ప్రశ్న చాలామందిలో వస్తుంది.

ఇలా ఎందుకు చేస్తారంటే చనిపోయిన వ్యక్తులు భవిష్యత్తులో మళ్లీ బ్రతికారని భూమిపై ఉన్న కొందరు నమ్ముతారు.

ఇదే ఆశతో ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రజలు చనిపోయిన తమ ప్రియమైన బంధువుల మృతదేహాలను భద్రంగా ఉంచుతున్నారు.

గత 50 ఏళ్లుగా అమెరికాలోని ఓ ల్యాబ్‌లో ఇలా చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను భద్రపరుస్తున్నారు. ఇప్పటికే చాల భద్రపరిచారు.

చనిపోయిన తమ బంధువులు తిరిగి సజీవంగా వస్తే వారి శరీరంలోనికి ప్రవేశిస్తారని ఇక్కడ ప్రజలు ఆశతో ఉన్నారు.

ఈ ప్రక్రియ మన భారతదేశంలో కూడా జరుగుతోంది. ఈ మృతదేహాలను మంచులా గడ్డకట్టిన ప్రదేశంలో దాచిపెడుతున్నారు.

అశుతోష్ మహారాజ్ మృతదేహాన్ని గత 6 సంవత్సరాలుగా పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానాలో భద్రంగా ఉంచుతున్నారు.

అశుతోష్ జి తీవ్ర మనోవేధనలో ఉన్నాడని, అతను ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని అతని భక్తులు విశ్వసిస్తున్నారు.