ఏసీలు కొంటున్నారా? ఈ టిప్స్ మీ కోసమే!
TV9 Telugu
18 March 2024
వేసవికాలంలో ఎండని తట్టుకోవడం చాల కష్టం. అందుకే చాలామంది ఇంట్లో చల్లగా ఉండడం కోసం ఎయిర్ కండీషనర్ ఉపయోగిస్తారు.
ఈ-కామర్స్ యాప్‌లలో, బయట మార్కెట్లలో ఏసీల అమ్మకాలు పెరిగాయి. ఏసీ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూసినట్లయితే..
110 చదరపు అడుగుల గదికి 1 టన్ను ఏసీ, 110 నుంచి 160 చ.అ గదికి 1.5 టన్నులు, 160 చ. అ గదికి 2 టన్నుల సామర్థ్యం ఉన్న ఏసీ కొనాలి.
ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా రేటింగ్ చూడాలి. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నవి తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి.
నిత్యం ఏసీ వాడేవారు ఇన్వర్టర్‌తో కూడిన ఏసీ తీసుకుంటే మంచిది. రోజుకు నాలుగు గంటలే ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు.
ఏసీతో పాటు తప్పకుండా స్టెబిలైజర్ కొనుగోలు చేయాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల ఏసీ పాడైతే వారంటీ ఉండదని గుర్తించాలి.
పీసీబీ వారంటీ ఉన్న వాటిని కొనుగోలు చేయాలి. పీసీబీ పాడైతే 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
కనీసం 5 సంవత్సరాల పీసీబీ వారంటీ, 10 సంవత్సరాల ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ ఉన్న వాటిని ఎంచుకోవడం మంచిది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి