ముత్యాలు ధరిస్తే.. ఈ రాశులవారికి కష్టాలు తప్పవు..!
Jyothi Gadda
30 July 2024
జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 రాశులు ఉన్నాయి. ఇవి విభిన్న తత్వాలను కలిగి ఉంటాయి. కొన్ని అగ్ని తత్వాన్నికి సంబంధించినవి అయితే మరికొన్ని జత తత్వంతో సంబంధం కలిగి ఉంటాయి.
స్త్రీలకు ముత్యాలంటే అమితమైన ప్రేమ. కానీ.. ఈ ముత్యాలను అందరూ ధరించకూడదట. కొన్ని రాశులవారికి ఈ ముత్యాలు ధరిస్తే సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
మిథున రాశివారు ముత్యాలు ధరించకుండా ఉండటమే మంచిది. ఈ రాశివారు ముత్యాలు ధరించడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మిథున రాశివారు ముత్యాలు ధరిస్తే మొదలుపెట్టిన పని కూడా మధ్యలోనే ఆగిపోతాయి. ఆ పనులు పూర్తి చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుందట.!
మకర రాశివారు కూడా ముత్యాలు ధరించకపోవడమే మంచిది. వీరికి ముత్యాలు పెద్దగా కలిసిరావు. తెలిసో, తెలియక ముత్యాలు ధరిస్తే వారికి ఆర్థిక సమస్యలు తప్పవంటున్నారు.
మకర రాశివారు ముత్యాలు ధరించటం వల్ల ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు... ఇతర సమస్యలు కూడా బాగా పెరిగిపోయే ప్రమాదం ఉందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
కుంభ రాశిని శనిదేవుడు పాలిస్తుంటాడు. శని దేవుడికి నీలం, నలుపు రంగులు అంటే ఎక్కువ ఇష్టం. ఈ రాశివారు ముత్యాలు ధరించడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.
కుంభరాశి వారు పొరపాటున ముత్యాలు ధరిస్తే, దీనివల్ల సుఖాలు, సౌభాగ్యాలు తగ్గుతాయి. ముత్యాలు ధరించడం వల్ల మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. పొరపాటున కూడా ముత్యాలు ధరించవద్దు.