వీళ్లు పుట్టగొడుగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు..!

Jyothi Gadda

17 January 2025

TV9 Telugu

చికెన్, మటన్ ఇష్టపడని వారు వాటి స్థానంలో పుట్టగొడుగుల్ని తింటున్నారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

TV9 Telugu

పుట్టగొడుగుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి విటమిన్ డి మంచి మూలం. వీటిని రోజూ తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు చాలా బలంగా మారతాయి.

TV9 Telugu

పుట్టగొడుగు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇందులో ఉండే పొటాషియం, సోడియం నిష్పత్తిగా తక్కువగా ఉంది. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. 

TV9 Telugu

పుట్టగొడుగుల్లో సెలినీయం ఉంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. రోజూ తింటే మెదడు సామర్థ్యం పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

TV9 Telugu

అయితే, కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని అస్సలు తినకూడదు. పుట్టగొడుగులను తినడం వల్ల కొంతమందికి చర్మ అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి. 

TV9 Telugu

ఇప్పటికే అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు పుట్టగొడుగుల్ని ఎక్కువగా తినకూడదు. వీళ్లు పుట్టగొడుగులు తింటే చర్మంపై దద్దుర్లు, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

TV9 Telugu

అంతే కాదు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం, ముక్కు పొడిబారడం, గొంతు పొడిబారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. 

TV9 Telugu

కొందరు తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు పుట్టగొడుగుల్ని తినకపోవడమే మేలు. ఇలాంటి వారు పుట్టగొడుగుల్ని ఎక్కువగా తింటే తలనొప్పి సమస్య ఎదుర్కోవాలి. 

TV9 Telugu