వైట్ స్ట్రాబెర్రీస్‌ని ఎప్పుడైనా రుచి చూశారా..! విటమిన్ Kసహా ఎన్నో ప్రయోజనాలు 

09 February 2024

TV9 Telugu

వైట్ స్ట్రాబెర్రీలను క్రాస్ బ్రీడింగ్ ద్వారా తయారు చేశారు. ఇవి తినడానికి రుచిగా ఉండటమే కాదు కొన్ని రకాల వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తున్నారు. 

వైట్ స్ట్రాబెర్రీస్

వైట్ స్ట్రాబెర్రీ 2010 ప్రారంభంలో ప్రజాదరణ పొందింది. తెల్లటి స్కిన్ మీద ఎర్రటి విత్తనాలతో అందంగా కనిపిస్తాయి. కొన్ని లేత గులాబీ రంగులో ఉంటాయి.

2010 ప్రారంభంలో

వైట్ స్ట్రాబెర్రీస్ చాలా జ్యుసీగా తీపిగా ఉంటాయి. అమెరికా, ఐరోపా,  జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి.

జ్యుసీగా తీపిగా

పైన్‌బెర్రీ అనే పదం పైనాపిల్, స్ట్రాబెర్రీ" అనే పదాల కలయికతో ఏర్పడింది. పైనాపిల్-వంటి రుచి కలిగిన పండు. వసంత ఋతువు, వేసవిలో లభిస్తాయి. 

వేసవిలో

వైట్ స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. శరీర వ్యాధులతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

విటమిన్ సి

వైట్ స్ట్రాబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీర కణాలను రక్షిస్తాయి. వ్యాధులతో  పోరాడడంలో యాంటీఆక్సిడెంట్లు సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్లు

వైట్ స్ట్రాబెర్రీస్ తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి బరువు నియంత్రణలో సహాయపడతాయి. 

బరువు నియంత్రణ

దీనిలో ఉండే అనేక పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గుండె సంబంధిత సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి.

గుండె ఆరోగ్యాన్ని

దీనిలో విటమిన్ల సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ K అధికంగా ఉంటుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది

 విటమిన్ K