భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని ప్రపంచ టీ రాజధాని అని పిలుస్తారు?
04 May 2026
Rajashekher
భారతదేశంలో టీ తాగేవారికి కొదవే లేదు. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీ రాజధాని కూడా ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ శాన్యం ప్రాంతంలోని అస్సాంను ప్రపంచ టీ రాజధాని అని పిలుస్తారు. అస్సాం టీ దాని అద్భుతమైన రుచికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
అస్సాం రాష్ట్రంలోని ప్రాంతం, అక్కడి వాతావరణం తేయాకు పంటకు అనుకూలంగా ఉండటంతో.. నాణ్యమైన పంటలు పండుతాయి.
బ్రహ్మపుత్రలోయ అంతటా విస్తరించి ఉన్న విశాలమైన తోటలు పెద్ద ఎత్తున తేయాకును ఉత్పత్తి చేస్తూ ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
అస్సాం తర్వాత పశ్చిమబెంగాల్, తమిళనాడు తేయాకు సాగుకు ప్రసిద్ధి చెందాయి. వాటిలో విస్తరమైన తేయాకు పంటలు పండుతాయి.
చైనా తేయాకు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం గ్రీన్, బ్లాక్, ఊలాంగ్ వంటి అనేక రకాల తేయాకులను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందింది.
తేయాకు మొక్కలకు తగినంత వర్షపాతంతో కూడిన వెచ్చని, తేమతో కూడిన వాతావరణం అవసరం. వాటికి 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు అనువైనవి.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు వివిధ రకాల రుచులలో తేయాకును ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా టీకి డిమాండ్ పెరుగుతోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్