సుసంపన్నమైన సాంస్కృతిక, భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది భారతదేశం. భారత రాజ్యాంగం ప్రకారం జాతీయ భాష లేదు.
దేశం హిందీ (దేవనాగరి లిపిలో), ఆంగ్లాన్ని ప్రభుత్వ ప్రయోజనాల కోసం అధికారిక భాషలుగా గుర్తిస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం 22 భాషలను అధికారిక భాషలుగా గుర్తింపు.
దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందీ భాష వినియోగంలో ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 52.82 కోట్ల మంది హిందీ మాట్లాడతారు.
రెండో స్థానంలో బెంగాలీని 9.72కోట్ల మంది వ్యవహారిక భాషగా ఉంది. మరాఠీలో మాట్లాడే వారి సంఖ్య 8.30 కోట్ల మంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో 8.11 కోట్ల మంది తెలుగులో మాట్లాడుతారు.
తమిళం మాట్లాడే వారి సంఖ్య 6.90 కోట్లు మంది. గుజరాతీ భాష మాట్లాడే వారి సంఖ్య 5.54 కోట్ల మందిగా ఉంది.
దేశంలో ఉన్న ప్రజల్లో 5.07 కోట్ల మంది ఉర్దూ మాట్లాడుతారు. కన్నడభాషను మాట్లాడేవారి సంఖ్య 4.37 కోట్లు మంది.
దేశవ్యాప్తంగా 3.75 కోట్ల మంది ఒడియా భాషను మాట్లాడుతారు. ఇక మలయాళం మాట్లాడేవారి సంఖ్య 3.48 కోట్ల మంది.