కళ్ళు తెరిచి నిద్రించే జీవులు ఏవో తెలుసా..?

02 September 2024

Battula Prudvi 

భూమిపై చాల రకాల జీవులు నివసిస్తున్నాయి. కళ్ళు తెరిచి నిద్రపోయే జీవులు భూమిపై చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

జిరాఫీ పొడవుగా ఎత్తు ఉన్నప్పటికీ, వేటాడే జంతువుల పట్ల అప్రమత్తంగా ఉంటుంది. అందుకే రాత్రి నిద్రిస్తున్నప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉంచుతుంది.

మొసళ్ళు ఒక కన్ను తెరిచి నిద్రిస్తాయి. విశ్రాంతి తీసుకునేటప్పుడు అవి పూర్తిగా కళ్ళు మూసుకోవు. అవి ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాయి.

బుల్ ఫ్రాగ్ ప్రత్యేక జాతి కప్ప. తన కనురెప్పల కదలిక లేకపోవడం వల్ల ఈ జివి కూడా కళ్ళు తెరిచి నిద్రిస్తుంది.

పెంగ్విన్ ఎప్పుడు కళ్ళు తెరిచి ఉంచుతుంది. ఇది వేటాడే చాల జీవులు జంతువుల నుండి అదనపు రక్షణగా భావిస్తుంది.

అన్ని పాములకు కనురెప్పలు లేవు. అందుకే కళ్ళు తెరిచే ఉంటాయి. నిద్రపోయేటప్పుడు కూడా అవి కళ్ళు మూసుకోలేవు.

డాల్ఫిన్ చాలా విచిత్రమైన రీతిలో నిద్రపోతాయి. నిద్రపోతున్నప్పుడు, వాటి మెదడులోని ఒక భాగం విశ్రాంతి తీసుకుంటుంది. మరొకటి చురుకుగా ఉంటుంది.

ఒక రకమైన నల్ల పక్షులు కూడా కళ్లు తెరిచి నిద్రపోయి మెదడుకు కొంత సమయం విశ్రాంతి ఇస్తాయి. తద్వారా వారి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది.