అధిక శాకాహారులు ఉన్న దేశాలు ఇవే.. 

TV9 Telugu

16 October 2024

భారతదేశం ప్రజల్లో 31-42 శాతం మంది శాకాహారం మాత్రమే తింటున్నారు అస్సలు మాంసాన్ని ముట్టరని తాజా నివేదికలు చెబుతున్నారు.

అత్యధిక శాకాహారులు ఉన్న దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉంది ఇజ్రాయెల్. ఈ దేశంలో 13 శాతం మంది ప్రజలు శాకాహారులు.

ఈ జాబితాలో తర్వాతి స్థానంలో తైవాన్‌ ఉంది. ఇక్కడ 12 శాతం మంది ప్రజలు శాకాహారులే.. అస్సులు నాన్ వెజ్ తినరు.

నాలుగవ స్థానంలో ఇటలీ దేశం ఉంది. ఈ దేశం 10 శాతం మంది ప్రజలు మాంసాన్ని ముట్టరు శాకాహారం మాత్రమే తీసుకుంటారు.

జర్మనీ, యూకే రెండు దేశాలు కూడా 9 శాతం శాకాహారులతో తాజాగా విడుదలైన ఈ దేశాల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాయి.

8 శాతం మంది శాకాహారు ప్రజలతో బ్రెజిల్‌ దేశం ఈ తాజాగా విదులైన నివేదికలో ఆరవ స్థానాన్ని కైవసం చేస్తుకుంది.

ఐర్లాండ్‌ ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ 6 శాతం మంది ప్రజలు శాకాహారం మాత్రం తీసుకొని జీవనం సాగిస్తున్నారు.

5-8 శాతం శాకాహారులతో ఎనిమిదవ స్థానంలో యూఎస్ఏ, 5 శాతం మందితో తొమ్మిదవ స్థానంలో ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి.