ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన దేశాలు ఇవే..

TV9 Telugu

05 November 2024

ప్రపంచంలో అత్యంత తక్కువ జనాభా ఉన్న దేశం హోలీ సీ. ఈ దేశంలో 518 మంది పౌరులు మాత్రమే వివాసం ఉంటున్నారు.

2024 ప్రకారం అత్యంత అల్ప జనాభా ఉన్న దేశాలల్లో రెండో స్థానంలో ఉంది టోకెలావ్ దేశం. ఇక్కడ 1,893 మంది ఉన్నారు.

ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన దేశం నియూ. ఈ దేశంలో నివసిస్తున్న జనం విషయానికి వస్తే 1,935 మంది మాత్రమే.

ఫాక్లాండ్ దీవులు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో పటగోనియన్ షెల్ఫ్‌లోని ఒక ద్వీపసమూహం. ఇక్కడ 3,791 నివాసం ఉంటున్నారు.

ఈ జాబితాలో ఉన్న ఐదవ దేశం మోంట్‌సెరాట్. ఇది కరేబియన్‌లోని బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ. ఇక్కడ 4,386 మంది జీవిస్తున్నారు.

సెయింట్ హెలెనా రిమోట్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీలోని మూడు భాగాలలో ఒకటి. ఈ దేశంలో 5,314 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

సెయింట్ పియర్ మరియు మికుల్లన్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్రాన్స్ యొక్క స్వయం-పరిపాలన ప్రాదేశిక దేశం. ఈ దేశం 5,840 మందికి నివాసం.

సెయింట్ బార్తెలెమీ కరేబియన్‌లోని ఫ్రాన్స్ విదేశీ సముదాయం. ఈ దేశంలో 10,994 మంది ప్రజలు మాత్రమే జీవనం కొనసాగిస్తున్నారు.