అమ్మాయైనా అబ్బాయైనా ఇవి కచ్చితంగా నేర్పించాల్సిందే!
19 September 2023
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా నేర్చుకుని తీరాల్సిన లైఫ్ స్కిల్స్ కొన్ని ఉన్నాయి. బాల్యం నుంచే ఈ జీవన నైపుణ్యాలను వారికి పరిచయం చేయాలి.
వంట తెలిస్తే తంటా ఉండదు. ఎవరో వండిపెట్టే దాకా ఎదురుచూడాల్సిన అవసరం రాదు. ఇష్టమైనవి వండుకోవడంలో, ఇష్టమైనవారికి వండిపెట్టడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది.
పుస్తకాలు ఒక క్రమ పద్ధతిలో ఉంటే చదువుకోడానికి వెంటనే తీసుకోవచ్చు. బట్టల్ని ప్రాధాన్య క్రమంలో సర్దుకుంటే బయటికి వెళ్తున్నప్పుడు సమయం వృథా కాదు.
దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్నవారిలో అధికశాతం.. ఆరోగ్యకరమైన అలవాట్లు లేనివారే అని అధ్యయనాలు చెబుతున్నాయి.
వేళకు పోషకాలతో భోజనం, సమయానికి నిద్ర, పరి శుభ్రత.. పసితనం నుంచే అలవాటు చేయాలి. అవసరమైతే ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాలి.
ఖర్చు సంపాదనపై ఆర్థిక పరిజ్ఞానం లేకపోతే కుబేరుడైనా ఏదో ఓ దశలో బికారి అవుతాడు. కాబట్టి, పిల్లలకు రూపాయి విలువ తెలియజెప్పండి.
అవసరమైనప్పుడు తమను తాము రక్షించుకోగలిగేలా కరాటే, కుంగ్ ఫూలాంటి ఆత్మరక్షణ విద్యలు తెలిస్తే మరీ మంచిది.
ఇలాంటి లైఫ్ స్కిల్స్ అలవర్చుకున్న అబ్బాయి అయినా, అమ్మాయి అయినా వారి జీవితాన్ని సంతోషంగా లీడ్ చేయగలుగుతారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి