దేశంలో హైస్పీడ్ టెస్ట్ రైల్వే ట్రాక్ ఎక్కడో తెలుసా?

TV9 Telugu

25 May 2024

భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ టెస్ట్ రైల్వే ట్రాక్ టెస్టింగ్ కోసం రాజస్థాన్‌ రాష్ట్రంలో రైల్వే శాఖ నిర్మించనుంది.

దేశంవ్యాప్తంగా భవిష్యత్తులో రాబోయే అన్ని హైస్పీడ్ రైళ్ల గరిష్ట వేగాన్ని ఈ ట్రాక్‌లో పరీక్షించనున్నారు.

భారతదేశంలో గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ఉన్న రైళ్లు ఈ ట్రాక్‌పై రైళ్లు నడుస్తాయమీ తెలిపింది రైల్వేశాఖ.

సాధారణ రైళ్లు నడిచే ట్రాక్‌లతో పోలిస్తే ఈ రైల్వే ట్రాక్ ఇతర రైల్వే ట్రాక్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

రాజస్థాన్ జోధ్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని సంభార్‌లో ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు.

ఈ ట్రాక్‌ను భూమి నుంచి కొంత ఎత్తులో నిర్మిస్తున్నారు. వాస్తవానికి, ఈ ట్రాక్‌పై భవిష్యత్తులో హైస్పీడ్ రైళ్లను పరీక్షించనున్నారు.

ఈ ట్రాక్ మొదట నేరుగా, తర్వాత వంతెనపై ఆపై వక్రంగా తయారు చేయడం జరిగింది. తద్వారా రైలును ప్రతి కోణం నుండి పరీక్షించవచ్చు.

64 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే ట్రాక్‌ నిర్మాణానికి రూ.800 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు రైల్వే అధికారులు.