ఒకప్పుడు మద్యం తాగటమంటే పెద్ద తప్పు. కానీ, ప్రస్తుతం అదొక ఫ్యాషన్. కాలంతో అలవాట్లు మారిపోతున్నాయి. అయితే, మద్యపానంతో తలెత్తే అనర్ధాలు ఎప్పుడూ ఒకేరకంగా ఉన్నాయి
TV9 Telugu
హాని చేస్తుందనీ తెలిసినా మద్యానికి దాసోహం అంటున్నారు మద్యం ప్రియులు. మద్యాన్ని మితంగా పుచ్చుకుంటే మంచిదేనన్నది ఈ జాడ్యానికి మరింత ఆజ్యం పోస్తోంది
TV9 Telugu
విస్కీ, బ్రాందీ, రమ్ము, జిన్ను, వైన్, వోడ్కా పేరేదైనా వాటిల్లో ఉండేది ఆల్కహాలే. కాకపోతే పర్సంటేజ్ మారుతుంది. వైన్‌లో పెద్దగా ఆల్కహాల్ ఉండదు, కేవలం ద్రాక్షరసమే అని సాకులతో కానిచ్చేస్తుంటారు
TV9 Telugu
రెగ్యులర్‌గా తాగడం చాలా మందికి అలవాటు. దీంతో వారికి ఇష్టమైన మద్యం కూడా ఉంటుంది. విస్కీ, రమ్, వోడ్కా, బీర్, స్కాచ్.. వీటన్నింటి రుచి ఒకేలా ఉండదు. వాటి రంగు, వాసనలో కూడా చాలా తేడాలు ఉంటాయి
TV9 Telugu
వీటిల్లో అత్యంత ప్రజాదరణ పొందిన రెండు మద్యం బ్రాండ్‌లు ఉన్నాయి. అవేంటంటే రమ్, విస్కీ. రెండూ డిస్టిల్డ్ స్పిరిట్స్ అయినప్పటికీ, వాటి మధ్య తేడాలు ఉన్నాయి
TV9 Telugu
చెరకు రసం లేదా మొలాసిస్ వంటి ఉప ఉత్పత్తుల నుండి రమ్ తయారు చేస్తారు. బార్లీ, మొక్కజొన్న, రై లేదా గోధుమ వంటి వివిధ రకాల ధాన్యాన్ని మాల్ట్ చేయడం ద్వారా విస్కీని తయారు చేస్తారు
TV9 Telugu
వైట్ రమ్ తెల్లటి నీటిలా ఉంటుంది. కానీ విస్కీ సాధారణంగా కాషాయం లేదా గోధుమ రంగులో ఉంటుంది. రమ్ రుచి తీయగా ఉంటుంది. కానీ విస్కీకి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. విస్కీలో ఎండిన పండ్లు, గింజల రుచులు కూడా ఉంటాయి
TV9 Telugu
రమ్ సాధారణంగా ఓక్ పీపాలలో బాగా పాతబడే వరకు దాచుతారు. ఇందుకు 48-96 గంటల సమయం పడుతుంది. రుచి కోసం వీటిని కాల్చిన ఓక్ బారెల్స్‌లో ఉంచుతారు. అయితే, విస్కీ రుచి దాన్ని పులియబెట్టే సమయం మీద ఆధారపడి ఉంటుంది