క్రెడిట్ కార్డ్ రివార్డులు ఎక్కువ పొందాలంటే..?
TV9 Telugu
19 October 2024
మీరు ప్రయాణం, మనీ బ్యాక్, గిఫ్ట్ కార్డ్‌లు లేదా వస్తువుల కొనుగోలు కోసం ఈ రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించవచ్చు.
మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన ప్రతిసారీ పాయింట్‌లను పొందుతారు.
సాధారణంగా ప్రతి రూపాయికి ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది ఈ పాయింట్‌ని డబ్బు లేదా గిఫ్ట్ కార్డ్‌గా మార్చుకోవచ్చు.
రివార్డ్ పాయింట్ కార్డ్ ప్రయాణం చేసే వారి కోసం. వీటితో మీరు విమాన ప్రయాణం, హోటళ్లు లేదా ప్రయాణ వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
హోటల్స్, రెస్టారెంట్, ఫుడ్ ఐటమ్స్ కొనుగోలు చేసినప్పుడు, కిరాణా వంటి కొన్ని విషయాలపై ఎక్కువగా పాయింట్స్ పొందవచ్చు.
క్యాష్‌బ్యాక్ కార్డ్‌లు నిర్దిష్ట దుకాణం లేదా బ్రాండ్‌తో అనుబంధంగా తయారు చేయడం జరుగుతుంది. వీటితో మీరు ఆ షాప్‌లో ఎక్కువ పాయింట్లను పొందవచ్చు.
మీరు కొత్త కార్డ్‌ని పొందిన మొదటి కొన్ని నెలల్లో కొనుగోళ్లు చేస్తే ఎక్కువ పాయింట్స్ రావచ్చు. కాబట్టి మీరు బోనస్ పాయింట్లను పొందుతారు.
కొన్ని కార్డ్‌లతో మీరు మీ పాయింట్‌లను ఎయిర్‌లైన్ లేదా హోటల్ ప్రోగ్రామ్‌లకు బదిలీ చేయవచ్చు. ఇది మీ పాయింట్లను మరింత విలువైనదిగా చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి