ఆఫీస్ టైమ్‌లో నిద్రపై తాజా అధ్యయనం ఏం చెబుతుందంటే.?
20 December 2023
TV9 Telugu
మీరు ఆఫీస్ టైమ్‌లో చేసే పని కాస్త చాలెంజింగ్‌గా ఉంటే అస్సలు నిద్రకు అవకాశం ఉండదని చెబుతున్నారు నిపుణులు.
కానీ వర్క్‌లో ఎలాంటి చాలెంజ్ లేకుండా కూర్చుని చేసే కొన్ని పనుల్లో చాలాసార్లు నిద్ర వస్తుంది. దాంతో ఉత్పాదకత తగ్గుతుంది.
ఆఫీస్ టైమ్‌లో కొంతసేపు నిద్రపోవడానికి అవకాశమిస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుందని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నారు.
జపాన్‌లో ఉన్న ఈ సంప్రదాయం పని బాగా చేయడానికి, అలసట నుంచి బయటపడేందుకు ముఖ్యమని తాజాగా జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో ఉద్యోగులు పేర్కొన్నారు.
ఆఫీస్ టైమ్‌లో కునుకు తీయడం, బ్రేక్ ఇవ్వడం ముఖ్యమని 94 శాతం మంది ఉద్యోగులు ఈ అధ్యయనంలో చెప్పారు.
ఇటీవల ఆన్‌లైన్‌లో చేసిన ఈ సర్వేలో మొత్తం 1,207 మంది కొన్నిప్రైవేట్, ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.
బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్‌ఎంసీజీ, హాస్పిటాలిటీ, ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది.
ఈ సర్వేలో కొన్ని ప్రశ్నలకు ఈ ఉద్యోగులు బదులిచ్చారు. వారిలో 94 శాతం మంది ఆఫీస్ టైమ్‌లో కొంతసేపు నిద్రకి మద్దతుగా మాట్లాడారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి