రైల్వే స్టేషన్స్‌లో ఫ్రీగా WiFi రావాలంటే..?
TV9 Telugu
14 August 2024
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 6,100 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వై -ఫై సదుపాయాన్ని కల్పిస్తోంది.
భారతీయ రైల్వే సంస్థ స్టేషన్లలో రైల్‌టెల్, రైల్‌వైర్ పేరుతో రైల్వే స్టేషన్‌లలో వై-ఫై ఇంటర్నెట్‌ను అందిస్తోంది.
ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. తర్వాత నామమాత్రపు ధరను చెల్లించాలి.
RailTel Wi-Fi సౌకర్యం కోసం నచ్చిన ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ప్లాన్ల కోరకు https://www.railtel.in/ రైల్‌టెల్ వెబ్‌సైట్ చూడొచ్చు.
రైల్‌వైర్ ఇంటర్నెట్ ప్యాక్‌లు 10 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. మీరు 34Mbps వేగంతో 5GB ఇంటర్నెట్ డేటాను ఉపయోగించుకోవచ్చు.
దీని వాలిడిటీ 24 గంటలు ఉంటుంది. https://www.railwire.co.in/ వెబ్‌సైట్ ద్వారా పూర్తి సమాచారన్ని పొందొచ్చు.
ఈ ఉచిత వై-ఫై సర్వీసెస్‌ను కేవలం రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఉపయోగించుకోవాలి. రైలు ప్రయాణంలో రైల్‌వైర్ ఇంటర్నెట్ పనిచేయదు.
Wi-Fi ప్లాన్ చెల్లింపు కోసం మీరు నెట్‌బ్యాంకింగ్, వాలెట్, క్రెడిట్ కార్డ్ మరియు UPI ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి