అమ్మాయిలు పెళ్లికి రెడీ అవుతున్నారా..? అబ్బాయిలను ఈ ప్రశ్నలు అడగండి..

08 July 2024

Shaik Madar Saheb

పెళ్లంటే నూరేళ్ల పంట.. మ్యారేజెస్‌ మేడిన్‌ హెవన్‌ అంటారు. ఒక్కసారి మూడుముళ్లు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు బతకడమే వివాహాబంధం..

అందుకే పెళ్లి అనేది ఓ పవిత్రబంధం అంటారు.. పెళ్లికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయడం చాలాముఖ్యం..

అమ్మాయిలు అయినా.. అబ్బాయిలు అయినా.. ముందు ఒకరినొకరు ఇష్టపడ్డ తర్వాత.. వారి గురించి తెలుసుకోవడం బంధాన్ని మరింత పటిష్టంచేస్తుంది..

అమ్మాయిలు.. పెళ్లి చేసుకునే ముందు.. మనువాడే వ్యక్తిని పలు విషయాలను అడగటం చాలా ముఖ్యం.. దీనివల్ల భవిష్యత్తుపై ఓ క్లారిటీ వస్తుంది..

వివాహం చేసుకోవాలా..? వద్దా..? మనసులోని మాటను చెప్పవచ్చు.. వివాహానికి ముందు అబ్బాయిని ఏ ప్రశ్నలు అడగాలో తెలుసుకోండి..

కెరీర్ లక్ష్యాలు.. మీకు పిల్లలు కావాలా? వద్దా..? తల్లిదండ్రులు, ఫ్యామిలీ నేపథ్యం ఏమిటీ అనే విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది..

హాబీస్, లైంగిక జీవితంపై అభిప్రాయం, బాల్యం ఎలా ఉండేది,  వీకెండ్స్ ఏం చేస్తారు, ప్రయాణంలో ఆనందిస్తారా..? స్నేహితులు ఉన్నారా..? అమ్మాయిలను గౌరవిస్తారా..? లేదా అనే విషయాలు..

ఆర్థిక ప్రణాళికలు, ఇష్టా ఇష్టాలు, వ్యక్తిగత జీవితం ఇలా అన్ని విషయాలను తెలుసుకోవడం ద్వారా వారి భావాలను అర్థం చేసుకోని మూవ్ కావొచ్చు..

ఇలాంటి విషయాలు తెలుసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది.. ఎలా ఉండబోతుంది.. అనేది అర్థమవుతుంది.. అప్పుడే స్పష్టమైన నిర్ణయం తీసుకోవచ్చు..