ప్రపంచంలో అత్యంత ఖరీదైన కీటకం ఏంటో తెలుసా ?

TV9 Telugu

13 July 2024

ప్రపంచంవ్యాప్తంగా లక్షల కోట్ల విలువ చేసే వస్తువులు ఎన్నో ఉన్నాయి. వాటిని ధనవంతులు ఎంతో మంది కొంటారు కూడా.

ప్రపంచంలో అనేక రకాల కీటకాలు కనిపిస్తాయి. వాటిలో అత్యంత ఖరీదైన కీటకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం స్ట్యాగ్ బీటిల్. ఈ కీటకాన్ని లూకానస్ సెర్వస్ అని కూడా కొంతమంది అంటారు.

స్ట్యాగ్ బీటిల్ కీటకాల బరువు సుమారు 2-6 గ్రాములు ఉంటుంది. ఈ కీటకం సగటు జీవితకాలం 3-7 సంవత్సరాలు మాత్రమే.

వీటిలో మగ కీటకాలు విషయానికి వస్తే 35-75 మి.మీ పొడవు ఉంటాయి, అదే ఆడ కీటకాలు మాత్రం 30-50 మి.మీ. పొడవు ఉంటాయి.

కొన్ని నివేదికల ప్రకారం చూస్తే దీని ధర అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపుగా రూ.75 లక్షలు ఉంటుందని సమాచారం.

ఈ ట్యాగ్ బీటిల్ కీటకాన్ని వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే ఈ కీటకం ధర ఇంత ఎక్కువగా పలుకుతుంది.

ఈ కీటకం ధర కొన్ని సార్లు బాగా పెరుగుతుంది కూడా. ఒక్కోసారి కోటి పైగా కూడా ఉంటుంది. దీన్ని ఎంతైన కొంటారు.