తత్కాల్ - ప్రీమియం తత్కాల్ మధ్య తేడా ఏమిటో తెలుసా..?
TV9 Telugu
13 April 2024
తత్కాల్‌లో రైలు ప్రయాణానికి ఒక రోజు ముందు బుకింగ్ చేయవచ్చు. చివరి నిమిషంలో జర్నీ ప్లాన్ చేసుకునేవారికి తత్కాల్ టికెట్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది.
తత్కాల్ కాకుండా, భారతీయ రైల్వేలు తత్కాల్ సదుపాయాన్ని పోలి ఉండే మరో కొత్త కోటాను ప్రారంభించింది. దీని కోసం మీరు సాధారణ టిక్కెట్ కంటే ఎక్కువ చెల్లించాలి.
రైల్వే తత్కాల్ టిక్కెట్లు ప్రయాణానికి ట్రైన్ లో ప్రయాణానికి ఒక రోజు ముందుగా బుక్ చేసుకోవల్సి ఉంటుంది.
స్లీపర్‌లో ప్రయాణించడానికి తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ప్రయాణానికి ముందురోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
తత్కాల్ టిక్కెట్లను రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌తో పాటు ఐఆర్సిటిసి వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.
మీరు ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయం ఇది. అయితే తత్కాల్ టికెట్ కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కోటాలో ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఇందులో టిక్కెట్లకు డిమాండ్ ఉంటే.. తత్కాల్ కంటే టికెట్ రేటు చాలా ఎక్కువ.
తత్కాల్ టికెట్, ప్రీమియం తత్కాల్ మధ్య అతిపెద్ద వ్యత్యాసం డబ్బు. సాధారణ కోటా, తత్కాల్ కోటాతో పోల్చితే చాల ఎక్కువగా ఉంటుంది.