పెర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ మధ్య తేడా ఏంటి.?

TV9 Telugu

13 May 2024

యువత పెర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ కోసం ప్రత్యేకంగా కలెక్షన్స్‌ను ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం పర్ఫ్యూమ్‌ మార్కెట్లో రూ. కోట్లను దాటి పోయింది.

ఇదిలా ఉంటే పెర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ మధ్య ఉన్న తేడాలు మీకు తెలుసా.? చాలా మందికి ఈ రెండింటింకీ మధ్య తేడాను గమనించలేరు.

ఆలోచనలో పడకండి.. వీటి రెండింటి మధ్య ఉన్న ప్రాధన తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోవాలంటే మీ కోసం ఇక్కడ చెబుతున్నాం.

ఈ రెండింటి మధ్యలో ఉండే ప్రధాన మొదటిగా చెబుకోనే వ్యత్యాసం ఏంటంటే పెర్ఫ్యూమ్‌ ఎసెన్స్‌. అంటే వాసన గాఢత.

సాధారణంగా పెర్ఫ్యూమ్‌లలో 25 శాతం వరకు ఎసెన్స్‌ ఉంటే, డియోడ్రెంట్‌లలో ఇది 1 నుంచి 2 శాతం మాత్రమే ఉంటుంది. పెర్ఫ్యూమ్‌ వాసన డియోడ్రెంట్‌ కంటే ఎక్కువ.

పెర్ఫ్యూమ్‌ల సువానస సుమారు 12 గంటలు వరకు ఉంటుంది. అయితే డియోడ్రంట్‌లలో ఇది కేవలం 4 గంటలు మాత్రమే ఉంటుంది.

డియోడ్రంట్‌లో ఉండే యాంటీ పెర్సిప్రెంట్‌ చెమటను పీల్చుకొని తాజా అనుభూతిని కల్పిస్తుంది. పెర్ఫ్యూమ్‌లో ఇది ఉండదు.

పెర్ఫ్యూమ్‌ను చర్మంపై నేరుగా స్ప్రే చేస్తే శరీరానికి హాని. బట్టలకు మాత్రమే అప్లై చేసుకోవాలి. కానీ డియోడ్రంట్‌ మాత్రం చర్మంపై తక్కువ ప్రభావం చూపుతుంది.