02 February 2024
TV9 Telugu
భారతదేశంలోని నదులను పవిత్రమైనవిగా భావిస్తారు. దైవంగా భావించి పూజిస్తారు. నదుల్లో గంగా నదిని అత్యంత పవిత్రమైన నదిగా పరిగణిస్తారు .
భారతదేశంలో అనేక నదులు ఉద్భవించాయి. వందలాది నదులు, ఉపనదులు ప్రవహిస్తున్నాయి. అయితే వీటిల్లో అతి పొడవైన నది ఏందంటే
భారతదేశంలోని అత్యంత పవిత్ర నది గంగ. దీని మొత్తం పొడవు 2,525 కిలోమీటర్లు. ఇది భారతదేశంలోని అతి పొడవైన జీవ నది కూడా.
గంగా నది తర్వాత దేశంలో పొడవైన నది గోదావరి. ఈ నది మొత్తం పొడవు 1,464 కిలోమీటర్లతో రెండవ స్థానంలో నిలిచింది.
1,400 కి.మీ పొడవైన కృష్ణా నది భారతదేశంలోని మూడవ పొడవైన నది కాగా గంగా నదికి ఉపనది అయిన యమున నది నాల్గవ ప్లేస్ లో నిలిచింది.
సింధు నది కూడా జీవనది. అంతేకాదు ఈ నది గంగా నదికంటే పొడవైనది.. దీని మొత్తం పొడవు 3,180 కిలోమీటర్లు.
సింధు ఆసియాలోని పొడవైన నదులలో ఒకటి. కానీ ఈ నది మన దేశంలో తక్కువ మొత్తంలోనే ప్రవహిస్తుంది.. అంటే దీని మొత్తం పొడవులో 1,114 కిలోమీటర్లు మాత్రమే భారతదేశంలో వస్తుంది.