అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక ఏ సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్‌తో తెలిసిపోతుంది. ఇంటర్నెట్ తెచ్చిన ఈ విప్లవాత్మక మార్పు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది
TV9 Telugu
ఇందులోని అధిక సమాచారం వల్ల కొన్ని రంగాల్లో దుష్పరిణామాలూ తలెత్తుతున్నాయి. అందులో వైద్యారోగ్యం ఒకటి. ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిందే ఇడియట్ సిండ్రోమ్
TV9 Telugu
ఆరోగ్యంపై ఆందోళనతో అనవసరంగా పదే పదే ఆన్‌లైన్‌లో శోధించడాన్నే ఇడియట్ సిండ్రోమ్ అంటారు. సిండ్రోమ్‌నే.. ‘ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్‌స్ట్రక్షన్ ట్రీట్మెంట్’ వైద్య పరిభాషలో సైబర్‌కాండ్రియా అని కూడా అంటారు
TV9 Telugu
చాలామంది తమ ఆరోగ్య లక్షణాల ఆధారంగా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి జబ్బు ఏంటో వారే నిర్ధరించుకుంటున్నారు. వైద్యుడిని సంప్రదించకుండానే చికిత్స కూడా చేసుకుంటున్నారు
TV9 Telugu
అయితే నెట్టింట వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారానికి కొదవే లేదు. అయితే, వీటిలో తప్పుడు సమాచారమూ లేకపోలేదు. టెక్నాలజీ మెరుగవుతున్నకొద్దీ ఇడియట్ సిండ్రోమ్ మరింత విస్తరిస్తోంది.
TV9 Telugu
ఇడియట్ సిండ్రోమ్‌తో బాధపడేవారు వాటిపై ఆధారపడి తమ వైద్యం తామే చేసుకుంటున్నారు. ఒక్కోసారి వారికి లేని సమస్యకు కూడా చికిత్స చేసుకునే ప్రమాదం ఉంది
TV9 Telugu
పూర్తిగా ఆన్‌లైన్ సెర్చ్‌పై ఆధారపడితే జబ్బును తప్పుగా నిర్ధరించే ప్రమాదం ఉంది. ఫలితంగా ఒక వ్యాధికి మరో చికిత్స తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు
TV9 Telugu
దీని నుంచి బయటపడాలంటే.. ముందుగా ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారమంతా నిజం కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. వైద్యులు ధ్రువీకరించకుండా ఎలాంటి నిర్ణయానికి రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమని తాము తక్కువ చేసుకోకూడదు