అతిగా వ్యాయామం చేస్తే ఏమవుతుందంటే..?

23 November 2023

కొంతమంది త్వరగా బరువు తగ్గాలని మితిమీరి ఎక్సర్‌పైజు చేస్తుంటారు. అందుకు గంటలకొద్దీ జిమ్‌ పరికరాలతో కుస్తీ పడుతుంటారు

అయితే ఇలా అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫలితంగా ఎన్నో ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతాయట

ఒత్తిడి, ఆందోళనలు దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాయామాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా వర్కవుట్లు చేసే క్రమంలో శరీరంలో డోపమైన్‌ అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్‌ విడుదలవుతుంది

అదే అతిగా వ్యాయామం చేస్తే ఒత్తిడి తగ్గడానికి బదులు మరింతగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కార్టిసాల్‌ అనే ఒత్తిడి హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుందట

అందుకే రోజూ అరగంట నుంచి నలభై నిమిషాల పాటు వ్యాయామానికి కేటాయిస్తే సరిపోతుందంటని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి నిద్ర కూడా అవసరం

అధికంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఆకలి పెరగడం, నచ్చిన పదార్థాలు ఎక్కువగా లాగించడం చేస్తుంటారు

ఇలా చేయడం వల్ల క్రమంగా బరువు తగ్గడానికి బదులు పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాయామం మితిమీరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం

అధికంగా వ్యాయామాలు చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందట. శరీరాన్ని అతిగా కష్టపెట్టడం వల్ల దాని ప్రభావం వల్ల జీవక్రియల సమస్యలు తలెత్తుతాయంటున్నారు