ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

13 July 2024

TV9 Telugu

TV9 Telugu

పని ఒత్తిడిలోనో.. టైం సరిపోవట్లేదనో చాలా మంది ఉదయం పూట అల్పాహారం మానేస్తుంటారు. అల్పాహారం అంటే కేవలం పని చేయడానికి శక్తిని అందించేదే కాదు

TV9 Telugu

ఇది శరీరంలోని పోషకాల లోపాన్ని కూడా పూరిస్తుంది. రోజూ ఇలా అల్పాహారం తీసుకోకపోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

ముఖ్యంగా గుండెజబ్బుల ముప్పును పెంచడంతోపాటు.. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని కోల్పోతామట. మౌంట్‌ సినానీలోని ఇక్హాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఎలుకలపై నిర్వహించిన తాజా అధ్యయనంలో ఇది తేలింది

TV9 Telugu

అల్పాహారం శరీరంలోని విటమిన్లు, మినరల్స్‌ లోపాన్ని భర్తీ చేస్తుంది. ఇంతటి విలువైన అల్పాహారం తీసుకోకపోతే శరీరంలో పోషకాల లోపం తలెత్తి రోగాల బారీన పడటం ఖాయం

TV9 Telugu

అల్పాహారాన్ని మానేయడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ తినకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమంగా మారుతూ హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది

TV9 Telugu

అల్పాహారం తీసుకోకపోతే షుగర్ లెవెల్ ఒక్కసారిగా పడిపోతుంది. ఇది రోజంతా మానసిక స్థితిని చికాకుపెడుతుంది. పని చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది

TV9 Telugu

ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉంటే జీవక్రియ మందగిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది గుండెను ప్రభావితం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

TV9 Telugu

నిద్ర లేచిన గంటలోపు టిఫిన్‌ పూర్తి చేయాలట. అది కూడా కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో నిండి ఉండాలి. ఇడ్లీ, దోశ వంటివి నచ్చకపోతే గుడ్డు, పాలు, చిరు ధాన్యాలు, నట్స్‌, ఓట్స్‌, రోటీ వంటివి తీసుకోవచ్చు