బ్రకోలీ విటమిన్ సి, జింక్, కాపర్, బి విటమిన్లు, ప్రోటీన్, ఆకుపచ్చని కూరల్లో వుండే సల్ఫోరాఫెన్ అనే ఫైటోకెమికల్ దీనిలో సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో మలినాలను తరిమేస్తుంది.
TV9 Telugu
బ్రకోలీలో వుండే ఇండోల్ – 3 కార్బినోల్, కాంఫ్ఫెరాల్ వంటి సమ్మేళనాలు మంట, వాపు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండి డయాబెటిస్ వున్నవారికి మంచిది.
TV9 Telugu
బ్రకోలీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. బ్రకోలీలో విటమిన్ సి, జింక్, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం , విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి.
TV9 Telugu
బ్రకోలీ తో క్యాన్సర్ ని కూడా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్రకోలీ క్యాన్సర్ కణాల వేగవంతమైన పెరుగుదలను తగ్గిస్తుందని,తద్వారా క్యాన్సర్ పెరుగుదలను నిరోధిస్తుంది.
TV9 Telugu
బ్రకోలీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. బ్రకోలీ షుగర్ పేషెంట్స్ హాయిగా తినేయవచ్చు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
TV9 Telugu
బ్రకోలీ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్‌తో పోరాడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కొంత వరకు నియంత్రించవచ్చు
TV9 Telugu
బ్రకోలీని తింటే చర్మానికి చాలా మంచిది. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. దీనికి కారణం బ్రకోలీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది.
TV9 Telugu
కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో బ్రకోలీ మంచిది. ఇమ్యూనిటీని పెంచడంలో కూడా బ్రకోలీ చాలా మంచిది. రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది.