అనారోగ్యంపై కారాలు మిరియాలు నూరేద్దామా..!

16 August 2024

TV9 Telugu

TV9 Telugu

సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్ల మిరియాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతాకాదు. పాలల్లో కాసిని మిరియాలు వేసుకుంటే... జలుబు పరార్‌! మిరియాల చారు రుచినే కాదు.. రోగనిరోధక శక్తినీ అందిస్తుంది

TV9 Telugu

వంటల్లో చిటికెడు మిరియాల పొడిని చేర్చడం వల్ల వంటకాల రుచి మారుతుంది. ముఖ్యంగా సూప్, ఉడికించిన గుడ్లు, సలాడ్‌లలో మిరియాల పొడి ప్రత్యేక రుచిని అందిస్తుంది

TV9 Telugu

 మిరియాలు ఆహారంలో రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా బలేగా కాపాడుతుంది. ముఖ్యంగా జలుబు, చర్మ వ్యాధుల చికిత్సలో మిరియాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి

TV9 Telugu

మిరియాల పొడిని స్క్రబ్బర్‌గా ఉపయోగించవచ్చు. ఇది చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం సులభంగా ఆక్సిజన్, రక్త ప్రసరణను పొందుతుంది

TV9 Telugu

పిగ్మెంటేషన్, మొటిమలను తొలగించడంలో కూడా మిరియాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. శరీరంలో అదనపు కొవ్వును తొలగించడంలో కూడా సహాయపడతాయి

TV9 Telugu

మిరియాలు తినడం వల్ల చెమట బాగా పడుతుంది. ఫలితంగా టాక్సిన్స్ బయటకు వస్తాయి. దీంతో మంచి చర్మంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది

TV9 Telugu

మిరియాలు కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావం స్థాయిని పెంచుతుంది. ఫలితంగా జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. జీర్ణశక్తి బాగుంటే మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి

TV9 Telugu

మిరియాల నూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే ధూమపాన వ్యసనాన్ని తగ్గిస్తుంది. ముక్కు దిబ్బడ, ఆస్తమా నుంచి ఉపశమనం పొందేందుకు గ్లాసుడు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే శ్లేష్మం తొలగిపోయి హాయిగా ఉంటుంది