పరగడుపున బొప్పాయి తినడం మంచిదేనా..! తెలుసుకోండి..

26 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

బొప్పాయి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. బొప్పాయి ఆరోగ్య గుణాల నిధి అని చెబుతారు.

బొప్పాయి ప్రయోజనకరమైనది

బొప్పాయిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సహా అనేక ముఖ్యమైన మినరల్స్ , విటమిన్లు ఉన్నాయి. ఇవి మనలోపల నుంచి పోషణలో సహాయపడతాయి.

పోషకాల మెండు 

బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం

నిపుణుల అభిప్రాయం

రోజూ ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం, ఉబ్బరాన్ని నివారిస్తుంది. కడుపునొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది

జీర్ణక్రియ

బొప్పాయిలో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ 

బొప్పాయిలో లైకోపీన్ , విటమిన్ సి ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ని తగ్గించడం ద్వారా చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుండి కాపాడుతుంది.

ఆరోగ్యంగా చర్మం 

విటమిన్ సీ, యాంటీ-ఆక్సిడెంట్లు బొప్పాయిలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఇది గుండె జబ్బులను దూరం చేస్తుంది.

గుండె ఆరోగ్యం కోసం