రోజూ ఒక అరటి పండు తింటే ఏమౌతుందో తెలుసా?

Jyothi Gadda

07 August 2024

అరటి పండ్లను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఈ పండ్లు ప్రతి సీజన్‌లోనూ దొరుకుతాయి. వీటి ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అరటి పండ్లను తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. అలసట మటుమాయం అవుతుంది. ఈ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. అందుకే చాలా మందికి భోజనం తర్వాత అరటి పండును తినే అలవాటు ఉంటుంది. 

అరటిపండ్లలో ఖనిజాలు, ఫైబర్స్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని ఆరోగ్యకరమైన పండుగా భావిస్తారు. అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, విటమిన్ బి6, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండ్లు అధిక రక్తపోటు నుంచి మన గుండెను రక్షించడానికి కూడా సహాయపడతాయి. 

అరటి పండ్లలో బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అరటి పండ్లలోని డోపామైన్, కాటెచిన్స్ మన మానసిక స్థితిని మెరుగ్గా  సహాయపడతాయి. అరటిపండ్లలో ఉండే సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించడానికి సహాయపడుతుంది. 

అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ రాత్రిళ్లు మనం బాగా నిద్రపోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ అరటిపండులో 320-400 మిల్లీగ్రాముల పొటాషియం కంటెంట్ ఉంటుంది. 

ఈ పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.అరటి పండ్లలో సోడియం తక్కువగా ఉంటుంది. తక్కువ సోడియం, అధిక పొటాషియం కలిసి హై బీపీని  కంట్రోల్‌ చేస్తుంది.

అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. డైలీ అరటి పండ్లను తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు.