వైన్ ఆల్కహాలిక్‌గా పరిగణించబడుతున్నప్పటికీ దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.
మద్యం తాగే ఔత్సాహికులు వైన్‌ను విస్కీ లాగా గొంతులో పోసుకుంటారు. మరికొందరు కేవలం 2-3 పెద్ద సిప్‌లు తీసుకొని బాటిల్ పూర్తి చేస్తారు.
వైన్ లేదా బీర్ నీటిలో కలిపి తాగడం తప్పుగా పరిగణిస్తారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందిని అంటున్నారు నిపుణులు.
విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా వంటి మద్యం పానీయాలను నీరు లేదా సోడాతో కలిపి తాగుతారు మద్యం ప్రియులు.
కానీ వైన్, బీర్ విషయానికి వస్తే, దానిని నీటి నుండి దూరంగా ఉంచడం మంచిది. వైన్‌లో నీరు కలిపినప్పుడు కొంతమంది వాటిని వింతగా చూస్తారు.
ఎక్కువ హ్యాంగోవర్‌ను నివారించడానికి కొంతమంది వైన్‌లో నీటిని కలుపుతారు. వైన్ తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
ద్రాక్షను జ్యూస్ చేసిన తర్వాత ద్రాక్ష తొక్కలను కలపడం ద్వారా వైన్‌కు రంగు వస్తుంది. నీటి నుండి దూరంగా ఉంచడానికి మరొక కారణం, నీరు వైన్ రుచిని పాడు చేస్తుంది.
కొన్ని అస్థిర సమ్మేళనాలు సల్ఫైడ్లు, సల్ఫైట్‌ల తరహాలో వెదజల్లుతాయి. నీరు వైన్ రసాయన నిర్మాణాన్ని వక్రీకరిస్తుంది.