సంపూర్ణ ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా కీలకం. ఇందులో ముఖ్యమైంది కిస్మిస్. నట్స్‌లో సూపర్‌నట్‌గా చెబుతారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, సరైన సమయంలో తినాలి.
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కిస్మిస్‌తో గట్ హెల్త్ ప్రయోజనం ఉంటుంది. నానబెట్టిన కిస్మిస్ అనేది ఒక సహజసిద్ధమైన ల్యాక్సేటివ్‌గా పనిచేస్తుంది.
శరీరానికి పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు కిస్మిస్‌తో లభిస్తాయి. కిస్మిస్‌లో పోలీఫెనోల్, ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నాశనం చేస్తాయి. స్వెల్లింగ్ తగ్గిస్తుంది.
రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే అద్భుతమైన లాభాలున్నాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది.
మధ్యాహ్నం వేళ చాలామందికి ఎనర్జీ తక్కువగా ఉండి నీరసంగా అన్పిస్తుంటుంది. ఈ సమయంలో కిస్మిస్ తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇందులో నేచురల్ స్వీట్ ఉంటుంది.
నానబెట్టిన కిస్మిస్‌లోని ఫ్రక్టోస్, గ్లూకోజ్ మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.
నానబెట్టిన కిస్మిస్‌లో ఓలినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతక్షయం ఏర్పడకుండా నివారిస్తుందని చెబుతారు. తద్వారా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తహీనత దూరం చేస్తుంది.
నానబెట్టిన కిస్మిస్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బాడీలో సోడియం లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.