చలికాలంలో మద్యం సేవిస్తే ఏమవుతుందో తెల్సా

06 December 2024

Ravi Kiran

చలికాలంలో కొందరు జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షించుకోవడానికి ఆల్కహాల్ తీసుకోవడం మొదలుపెడతారు. అయితే ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే అస్సలు ముట్టుకోరని అంటున్నారు వైద్యులు.

ఈ కాలంలో మద్యం తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ శీతాకాలంలో మద్యం సేవించడం వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీకావు. 

ఈ అలవాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం నీలంగా మరుస్తుందట. 

పెదవుల నుండి రక్తం, కఫం సమస్యలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్ సూచిస్తున్నారు. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వెచ్చగా ఉండటానికి మద్యం తాగడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. 

ఈ కాలంలో మద్యం సేవించడం వల్ల మొదట వెచ్చని అనుభూతిని కలిగిస్తుంది. కానీ క్రమంలో ఆల్కహాల్ మీ హృదయ స్పందన రేటు పెంచుతుంది. 

ఇది అరిథ్మియా ప్రమాదాన్ని పెంచుతుంది. విపరీతమైన చలిలో మద్యం సేవించడానికి బదులు మందపాటి బట్టలు ధరించడం, పోషకాహారం తీసుకోవడం లాంటివి చేయమని సూచిస్తున్నారు.