తాబేళ్లు ఏం తింటాయో తెలుసా..?

TV9 Telugu

11 August 2024

నీటిలో నివసించే తాబేళ్లు సర్వభక్షకులు.. ఉభయ చర జీవి. తాబేలు ఆహారం అలవాట్లు అన్నింటికి విభిన్నంగా ఉంటాయి.

తాబేళ్లు మొక్కలు, మాంసం రెండింటినీ తింటాయి. అందుబాటులో ఉన్న ఆహార వనరులు అన్ని కూడా తింటాయి తాబేళ్లు.

వయోజన భూమి తాబేళ్లు మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. గడ్డి, చెట్ల పొదలు, ఆకులు మాత్రమే తీసుకుంటాయి.

కొన్ని రకాల తాబేళ్లు పండ్లు తినేస్తాయి. కొన్ని రకాల తాబేళ్లు చిన్న గింజలను, గొంగళి పురుగులు తింటాయి.

నీటిలో నివసించే తాబేళ్లు అందులో ఉన్న చిన్న చేపలను కూడా తింటాయి. ఇవి వాటి శరీరానికి ప్రోటీన్‌ను అందిస్తాయి.

కీటకాలు, క్రికెట్‌లు, ఇతర చిన్న జలచరాలను తింటాయి. నత్తలను కూడా తింటాయి. నత్తలు వాటి ఆహారంలో ముఖ్యమైన భాగం.

కొన్ని తాబేళ్లు నీటిలో పెరిగే మొక్కలను కూడా తింటాయి. అవి నీటి హైసింత్, ఆల్గే వంటివి ఇవి తినే ఆహారాల్లో ఉన్నాయి.

కొన్నిసార్లు తాబేళ్లు పండ్లు, కూరగాయలను కూడా తింటాయి. దోసకాయ, పుచ్చకాయ, ఆకు కూరలు వంటివి కూడా తింటాయి.