యుక్తవయసులో మొటిమలు సర్వ సాధారణ సమస్య. దీనికి మూలం హార్మోన్ల మార్పులు. సాధారణంగా మొటిమలు ముఖం మీదే కనిపించినప్పటికీ కొన్నిసార్లు వీపు, ఛాతీ, భుజాల మీదా రావొచ్చు
TV9 Telugu
అయితే కొందరికీ 30 ఏళ్ల తర్వాత కూడా ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ఇలా రావడానికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత అంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
అవును, హార్మోన్ల మార్పుల వల్ల కూడా ముఖంపై మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. వేయించిన నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి
TV9 Telugu
శరీరంలో విటమిన్ బి7 లోపించినా ముఖంపై మొటిమలు రావచ్చు. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం.. ఇలా పలు కారణాలు కూడా మన చర్మాన్ని దెబ్బతీస్తాయి
TV9 Telugu
రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో చర్మం జిడ్డు తగ్గుతుంది. మృతకణాలు వదిలిపోతాయి. అలాగని ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటే మేలు కన్నా కీడే ఎక్కువ
TV9 Telugu
తరచూ చేతులను ముఖానికి తాకిస్తుంటే బ్యాక్టీరియా వ్యాపించే అవకాశముంది. అప్పటికే ఉబ్బి ఉన్న చర్మం మరింత చికాకుకు గురవుతుంది. మొటిమలను గిల్లటం, గోకటం, నొక్కటం వంటివేవీ చేయొద్దు. దీంతో బ్యాక్టీరియా మరింత లోపలికి వెళ్లి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు
TV9 Telugu
మానసిక ఒత్తిడితో మొటిమలు తీవ్రమయ్యే అవకాశముంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. యోగా, ధ్యానం వంటివి ఇందుకు ఉపయోగపడతాయి
TV9 Telugu
వేపుళ్లు, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. పాల ఉత్పత్తులు, చక్కెర ఎక్కువగా ఉండే మిఠాయిల వంటివి మొటిమలను ప్రేరేపించే అవకాశముంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం