మీరూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగుతున్నారా ? ఈ సమస్యలొస్తాయి..

27 September 2024

TV9 Telugu

TV9 Telugu

వేడినీరు తాగితే బరువు తగ్గడంతో పాటు చాలా లాభాలు ఉన్నాయి. అయితే వేడి నీటిని తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి

TV9 Telugu

బరువు తగ్గేందుకు చాలా మంది ఉదయం నిద్ర లేవగానే వేడి నీరు తాగుతారు. ఇలా ఖాళీకడుపుతోనే వేడినీరు తాగడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. వేడి నీరు అధికంగా వేడిగా ఉండకూడదు. గోరువెచ్చని లేదా సాఫ్ట్‌ వాటర్‌ మాత్రమే తాగడం ప్రయోజనకరం

TV9 Telugu

వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అన్నవాహిక, నాలుక, పొట్టపై ఉన్న పలుచని పొర కాలిపోతుంది. వేడినీళ్లు లేదా కషాయాలను ఎక్కువగా తాగితే అల్సర్లు, అసిడిటీ సమస్య, గొంతునొప్పి కూడా పెరుగుతుంది

TV9 Telugu

రెగ్యులర్‌గా వేడి నీరు తాగితే దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా వేడి నీరు తీసుకోవడం వల్ల నాలుకపై టేస్ట్ బడ్స్ కూడా దెబ్బతింటాయి. దీంతో మనం కాసేపటి వరకూ ఏం తిన్నా వాటి టేస్ట్ తెలియదు

TV9 Telugu

వేడినీటిని తాగితే బాడీలో డీహైడ్రేషన్ పెరుగుతుంది. అదే విధంగా, బాడీ కొన్ని పోషకాలు, ఖనిజాలను అబ్జార్బ్ చేయడంలో ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని మందులు వేసుకున్నా పనిచేయవని చెబుతున్నారు

TV9 Telugu

ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగితే అది జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు యాసిడ్ రిఫ్లక్స్, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, పరగడపున తాగొద్దు.

TV9 Telugu

వేసవిలో లేదా వేడి వాతావరణంలో వేడినీరు తాగకపోవడమే మంచిది. మీకు వేడినీళ్లు తాగే అలవాటు ఉంటే ఈరోజే దాన్ని మానుకోవడం మంచిది. బదులుగా గోరువెచ్చని నీటిని తాగొచ్చు