నిమ్మ తొక్కే కదా అని పడేస్తే.. నష్టం మీకే..
29 September 2025
Prudvi Battula
దాదాపు అందరు నిమ్మకాయ రసం పిండేసిన తొక్కలను పారేస్తారు. కానీ వీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు నిమ్మకాయ తొక్కలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పవర్‌ఫుల్ బయోయాక్టివ్ కాంపౌండ్స్, D-లైమోనిన్ అనే కాంపౌండ్స్ ఉన్నందున హృదయ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ దూరం అవుతాయి.
ఈ తొక్కలలోని ఫైబర్ అధికంగా ఉన్నందున జీర్ణక్రియను మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో కోలన్‌ను శుభ్రం చేసి బ్లోటింగ్‌ను తగ్గిస్తుంది.
ఈ తొక్కలతో స్కిన్ సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మంపై డార్క్ స్పాట్స్, ముడతలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.
నిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి బేకింగ్ సోడా, ఉప్పుతో కలిపి బ్రష్ చేసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ తొక్కల్లో పుష్కలంగా ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
నిమ్మకాయ తొక్కలు చుండ్రు, జుట్టు రాలడం వంటి వాటిని దూరం చేసి జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ మొక్కలు ఉంటే.. ఇంటికి అరిష్టం.. వెంటనే తొలగించండి..
రోజుకు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్.. ఆ సమస్యలన్నీ ఖతం..
చేప తల తింటే.. అన్లిమిటెడ్ బెనిఫిట్స్