పోషకాల గని దోసకాయ...లాభాలు తెలిస్తే..

పోషకాల గని దోసకాయ...లాభాలు తెలిస్తే..

Jyothi Gadda

18 November 2024

వేసవికాలంలో దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమే కాకుండా అన్ని కాలాలలోనూ చాలా ప్రయోజనాలున్నాయి.

TV9 Telugu

వేసవికాలంలో దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమే కాకుండా అన్ని కాలాలలోనూ చాలా ప్రయోజనాలున్నాయి. 

ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్‌లు, మినరల్స్‌ దోసకాయలో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా దానిని చర్మానికి వాడే వివిధ రకాల ఉత్పత్తులలో కూడా వాడుతున్నారు.

TV9 Telugu

ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్‌లు, మినరల్స్‌ దోసకాయలో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా దానిని చర్మానికి వాడే వివిధ రకాల ఉత్పత్తులలో కూడా వాడుతున్నారు. 

దోసకాయలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. వేసవి కాలంలో వేడి చేస్తే శరీరాన్ని చల్లబర్చేందుకు కార్బోనేటేడ్ ద్రావణాల కన్నా, దోసకాయ మేలు.

TV9 Telugu

దోసకాయలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. వేసవి కాలంలో వేడి చేస్తే శరీరాన్ని చల్లబర్చేందుకు కార్బోనేటేడ్ ద్రావణాల కన్నా, దోసకాయ మేలు. 

TV9 Telugu

ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దోసకాయలో యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలు ఉన్నందువలన, కంటికి కలిగే వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

TV9 Telugu

శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్ దోసకాయలో ఉందని పరిశోధనల్లో తేలింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, దోసకాయ రసం తాగటం మంచిది.

TV9 Telugu

శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే స్టేరాల్ అనే మూలకం దోసకాయలో ఉంటుంది. అంతేకాదు, అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి, తక్కువ క్యాలరీలను అందిస్తుంది. 

TV9 Telugu

అధిక మొత్తంలో ఫైబర్‌ ఉండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నిండుగా ఉంటుంది. దోసకాయలో ఉండే నీటి శాతం, శరీరంలో ఉండే విష, హానికర పదార్థాలను బయటకు పంపుతుంది.

TV9 Telugu

శరీరాన్ని చల్లబరచి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. జుట్టు, గోళ్ళ పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషించే సిలికాను పుష్కలంగా కలిగి ఉంటుంది. 

TV9 Telugu