30 ఏళ్లు దాటారా? అమ్మాయిలూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..

01 October 2024

TV9 Telugu

TV9 Telugu

వయసు పెరిగే కొద్దీ శారీరకంగానూ, మానసికంగానూ మార్పులు రావడం అందరికీ సహజమే. ముఖ్యంగా మహిళల్లో 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలు బలహీనమవుతూ ఉంటాయి

TV9 Telugu

ముప్పై ఏళ్లు వచ్చేసరికి స్త్రీల శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. మూడ్ స్వింగ్స్‌తో జుట్టు, చర్మం రంగులు కొంత వరకు మారిపోవడం వంటివి జరుగుతుంటాయి

TV9 Telugu

కాబట్టి ఆహారంతో పాటు జీవనశైలిలో కూడా మార్పు చేసుకోవాలి. స్త్రీల శరీరంలో వయసు పెరిగేకొద్దీ పోషకాల నష్టం కూడా పెరుగుతుంది. అందువల్ల తినే ఆహారాలపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం

TV9 Telugu

ముప్పై తర్వాత మహిళలు దానిమ్మ, నారింజ, బొప్పాయి, పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పాలు, పెరుగు, చీజ్‌... లాంటి పాల ఉత్పత్తులు కూడా అధికంగా తీసుకోవాలి

TV9 Telugu

వీటి నుంచి క్యాల్షియం, ప్రొటీన్‌, విటమిన్‌-డి లభిస్తాయి. ఇవి ఎముకలు బలంగా ఉండేందుకు సాయపడతాయి. జీర్ణ ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి

TV9 Telugu

పాల ఉత్పత్తులు తినడం వల్ల పొట్ట నిండినట్టయ్యి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. బరువు పెరుగుతామనే భయమూ ఉండదు

TV9 Telugu

అత్యావశ్యక పోషకాలు, పీచు... లాంటివి గోధుమ, జొన్న, రాగులు, బ్రౌన్‌రైస్‌లలో మెండుగా ఉంటాయి. ఎముక ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు రోగనిరోధక శక్తినీ అందిస్తాయి

TV9 Telugu

గుడ్లు... మాంసకృత్తులు మెండుగా ఉంటాయి.  కండరాలు, ఎముకలను బలంగా మారుస్తాయి. అలసట, నిస్సత్తువ లాంటివి దరిచేరకుండా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి