మునగాకు పొడి తింటే శరీరంలో జరిగేది ఇదే..!

Jyothi Gadda

05 October 2024

మునగాకులోని అధిక విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సాధారణ అనారోగ్యాల నుండి రక్షణ పొందవచ్చు.

వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటంవల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేగాక ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గులాంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.

పాలకూరతో పోలిస్తే మున‌గాకులో మూడు రెట్లు ఎక్కువగా ఐరన్‌ ఉంటుంది. అరటిపండు కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది.

మునగాకులో ఎక్కువగా ఉండే పీచువల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువ‌ల్ల మున‌గాకును నిత్యం వాడ‌టంవ‌ల్ల అతిగా తిన‌డం అనే స‌మ‌స్య తీరుతుంది.

మున‌గాకులో ఉండే క్లోరోజనిక్‌ ఆమ్లం కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.

మునగలోని విటమిన్‌-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మున‌గాకులోని అమైనో ఆమ్లాలు ప్రొటీన్‌ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్‌ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

మునగాకు పొడి చర్మ-పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది మొటిమలను తగ్గించడంలో, ముడతలను తగ్గించడంలో , చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మునగాకు జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది, బరువు నిర్వహణకు సహాయపడుతుంది. దీని ఫైబర్ కంటెంట్ సంపూర్ణత్వ భావనను ప్రోత్సహిస్తుంది, అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.