ఆకు కాదిది..అద్భుత సంజీవని! తింటే ఏమౌతుందో తెలుసా?

Jyothi Gadda

12 June 2024

మునగాకు మంచి పోషకాహారం. అందుకే దీనిని వండర్ ట్రీ లేదా ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా పిలుస్తారు. దీన్ని వేలాది సంవత్సరాలుగా ఎన్నో వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు.

మునగాకులో ఓట్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫైబర్, క్యారెట్ల కంటే రెట్టింపు విటమిన్ ఎ, పాల కంటే ఎక్కువ కాల్షియం, అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం, బచ్చలికూర కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది.

మునగకాయలు మాత్రమే కాదు..ఆకులు, పువ్వులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. చాలా మంది దీని ఆకుల పొడిని తయారు చేసి ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 

ఉదయం టీ, కాఫీలకు బదులుగా మునగాకు టీని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి మంచి పోషణ లభిస్తుంది.

మునగాకు ఆస్తమాను పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆస్తమాను నయం చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తగ్గిస్తుంది. 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగాకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. మూత్రంలో చక్కెర, ప్రోటీన్ మొత్తాన్ని తగ్గింస్తుంది. 

మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.

మునగాకు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది జీవక్రియను పెంచి ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో మీ బరువు కంట్రోల్ అవుతుంది. ఈ ఆకుల్లో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. 

మునగాకు ఆరోగ్యంతో పాటుగా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అవును దీని ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ పెరుగుతుంది. అలాగే ఇది ముఖంపై వచ్చే మొటిమలను కూడా తగ్గిస్తుంది.