ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అంజీర్ ఒకటి. అంజీర్‌లో పీచు, ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, జింక్, ఫొలేట్, రిబోఫ్లేవిన్, భాస్వరం అధికంగా ఉంటాయి
ఊపిరితిత్తుల్లో సమస్యలు, శ్వాసలో ఇబ్బందులను తొలగిస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది. పైల్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది
TV9 Telugu
చర్మానికి కాంతి వస్తుంది, ముడతలు పడదు. అల్జీమర్స్‌తో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని అలాగే తినొచ్చు. మిల్క్ షేక్, హల్వా లాంటివీ చేసుకోవచ్చు
TV9 Telugu
అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అత్తి పండ్లను ఎక్కువగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంజీర్ అత్తి పండ్లను ఎక్కువగా తింటే తీవ్రమైన దుష్పరిణామాలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
అత్తి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపం ఏర్పడుతుంది. అలాగే దీన్ని తినడం వల్ల శరీరంలో సల్ఫైట్ పెరుగుతుంది. ఇది మైగ్రేన్‌కు దారి తీస్తుంది
TV9 Telugu
అలర్జీ సమస్యలతో బాధపడేవారు అంజీర పండ్లను తినకూడదు. అంజీర్‌లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అందుకే వీటిని అతిగా తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు
TV9 Telugu
అత్తి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం ఏర్పడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా అత్తి పండ్లను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది