ఉదయాన్నే వీటిని తీసుకుంటే బరువు తగ్గుతారు

05 June 2024

TV9 Telugu

Pic credit - getty

ప్రస్తుతం బరువు పెరగడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. బరువు పెరిగితే శరీరం ఆకృతి లేకుండా పోతుంది. అంతేకాదు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుంది.

బరువు పెరిగితే 

అందం, ఆరోగ్యం కోసం బరువును నియంత్రించుకోవడం తప్పని సరి. దీనికి మంచి జీవక్రియను కలిగి ఉండటం ముఖ్యం. దీంతో వ్యాయామంతో పాటు.. రోజువారీ ఉదయం తినే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవాలి

బరువు నియంత్రణ ఎలా?

బరువు నియంత్రణ కోసం ఉదయం గోరువెచ్చని నీటితో రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవచ్చు. ఇది అనేక విధాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

వెల్లుల్లి

బరువు తగ్గడానికి ఉదయాన్నే తులసి ఆకులను నీటిని తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇలా తులసి ఆకుల నీరుని 40 రోజులకు మించి తీసుకోకూడదు. 

తులసి ఆకులు

ఉదయపు అల్పాహారంగా పెసలు, పచ్చి శనగలు, వేరుశెనగల మొలకలను తినండి. ఇది ప్రోటీన్‌ను అందిస్తాయి. బరువును నియంత్రిస్తాయి. కండరాలను బలంగా ఉంచుతాయి. 

మొలకలు

ఉదయాన్నే బొప్పాయి తినవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.

బొప్పాయి

బరువు తగ్గడానికి, ఉదయం జీలకర్ర నీరు, నిమ్మకాయ నీరు లేదా గ్రీన్ టీ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

ఈ పానీయాలు త్రాగండి