భోజనం చేసిన తర్వాత ఈ ఒక్కపని చేస్తే ఆ సమస్యలన్నీ పరార్..!
19 August 2024
TV9 Telugu
TV9 Telugu
బరువు తగ్గాలంటే బయట ఆహారాలు ఎక్కువగా తినకూడదు. ఎల్లప్పుడు ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే తిన్న తర్వాత వెంటనే పడుకుంటారా? అయితే వెంటనే ఈ అలవాటు మానేయాలి
TV9 Telugu
భోజనం తిన్న తర్వాత మీరు చేసే చిన్న పని ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తుంది. అదేంటంటే వాకింగ్. అవును..ఈ అలవాటు వల్ల ఒంట్లో కొవ్వు వెంటనే పోతుంది
TV9 Telugu
తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నడక కడుపు కండరాలను సక్రియం చేస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల కార్యకలాపాలను పెంచుతుంది
TV9 Telugu
మలబద్ధకం వల్ల పైల్స్, ఫిస్టులా సమస్యలు పెరుగుతాయి. కానీ తిన్న తర్వాత రెగ్యులర్ గా నడిస్తే ఆ సమస్య కూడా దూరమవుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయి కూడా తగ్గుతుంది
TV9 Telugu
తిన్న తర్వాత నడవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా చేస్తుంది
TV9 Telugu
అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే, ప్రతిరోజూ తిన్న తర్వాత 10 రోజులు నడవండి. ఇది కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. ఫలితంగా అదనపు పొట్ట కొవ్వును పోగొట్టడానికి సహాయపడుతుంది
TV9 Telugu
తిన్న తర్వాత నడవడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాకింగ్.. ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుంది. ఫలితంగా మానసిక ప్రశాంతత, సమతుల్యత నెలకొంటుంది
TV9 Telugu
తిన్న తర్వాత నడవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది గుండె కండరాలను బలపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత చేసే వాకింగ్ సుఖ నిద్రకు తలుపులు తెరుస్తుంది