Jyothi 

01 April 2024

అందమైన కళ్లు..కంటి చూపు దెబ్బతినకుండా కాపాడే చిట్కాలు..

కంటి చూపు మెరుగుపరచడానికి కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్లు ఆకు కూరల్లో పుష్కలంగా ఉంటాయి. కళ్ల ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి, లుటిన్ కూడా ఆకు కూరాల్లో అధికంగా లభిస్తాయి. క్రమం తప్పకుండా ఆకుకూరలు తినాలి.

కంటి చూపు మందగించడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కొన్ని చెడు అలవాట్లు కూడా కంటి చూపుపై ప్రభావం చూపుతాయి. అయితే చాలా మంది కంటి సమస్యలు తలెత్తినప్పుడు, దృష్టి లోపాలు ఏర్పడినపుడు వెంటనే కళ్లజోడు, కాంటాక్ట్ లెన్సులు తప్పవు.

క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. విటమిన్‌ ఏ కంటిచూపునకు తోడ్పడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తుంది. క్యారెట్, నారింజ, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, సీ ఫుడ్స్, బచ్చలికూర ఆరోగ్యాన్ని అందిస్తాయి.

ఎండలో తిరిగే సమయంలో కళ్ళు హానికరమైన UV కిరణాలకు గురికావచ్చు. అది కంటి క్యాన్సర్ కు దారితీయవచ్చు. కాబట్టి ఎండలోకి వెళ్లే సమయంలో దుమ్ము పడకుండా , యూవీ కిరణాల నుండి రక్షణగా ఉండేందుకు సన్ గ్లాస్ అద్దాలను వాడుకోవటం మంచిది.

కళ్లను చీటికిమాటికి నలపడం, రుద్దడం చేయవద్దు. దీంతో మీ కళ్ల బయటి ఉపరితలం దెబ్బతింటుంది. కార్నియా బలహీనంగా మారుతుంది. దురదలు ఉన్న సందర్భంలో చల్లని నీటితో కళ్లను శుభ్రపరుచుకోవటం మంచిది. పని చేయడానికి కళ్ళలో తేమ ఉండాలి. 

చక్కటి కంటి ఆరోగ్యానికి కూరగాయలు కూడా మేలు చేస్తాయి. చిలగడదుంపలో విటమిన్ ఎ, విటమిన్ సి, లుటిన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. మీ కంటి చూపు మెరుగవుతుంది.

బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది. బాదం తరచుగా తీసుకుంటే వయస్సు మీద పడటం వల్ల వచ్చే మచ్చల క్షీణత, కంటిశుక్లం సమస్యను నివారిస్తుంది. గుడ్లలలో లుటిన్, జియాక్సంతిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది వయస్సు-సంబంధిత దృష్టి లోపం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఇ లాగా, విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది వయస్సు-సంబంధిత దృష్టి సమస్యలతో పోరాడుతుంది. చేపలలో ఒమేగా -3 కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.