ఆరోగ్యానికి మంచిది కదాని అవిసెగింజలను ఎడాపెడా వాడేస్తున్నారా?

13 October 2024

TV9 Telugu

TV9 Telugu

అవిసెగింజలు మహిళల ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని కొంతమంది ఓ పద్ధతంటూ లేకుండా తినేస్తుంటారు

TV9 Telugu

ఇలా తీసుకుంటే శరీరానికి మేలు చేసే ఆహారమే అయినా... తినాల్సిన పద్ధతిలో తినకపోతే ఆరోగ్యానికి బదులు అనారోగ్యం పాలు చేస్తుంది. ముఖ్యంగా అవిసెగింజలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

TV9 Telugu

అవిసె గింజల్లో ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా లిగ్‌నాన్స్‌ ఉంటాయి. మహిళలకు అవసరమైన ఈస్ట్రోజన్‌, యాంటీ ఆక్సిడెంట్లు కలిపి ఉన్న ఆహారం ఇది. వీటిల్లోని ఒమెగా-త్రీ ఆమ్లాలకి రొమ్ముక్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది

TV9 Telugu

మెనోపాజ్‌ సమయంలో, ఆ తర్వాత శరీరం నుంచి ఆవిర్లు వెలువడుతుంటాయి. ఈ సమస్య అదుపులోకి రావాలంటే రోజూ చెంచా గింజలు తింటే ఫలితం ఉంటుంది

TV9 Telugu

అవిసెగింజల్లో ఒమెగా-3, పీచు పుష్కలంగా ఉండటం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. అలాగని వీటిని ఎక్కువ తినకూడదు అంటున్నారు నిపుణులు

TV9 Telugu

ముఖ్యంగా అలర్జీలు, థైరాయిడ్‌... గ్యాస్‌ సమస్యలున్నవారు, గర్భిణులు, బాలింతలు అవిసె గింజలకు దూరంగా ఉండటమే మంచిది. వీటిల్లోని సైనోజెన్‌ అని హానికారక రసాయనం థైరాయిడ్‌ సమస్యని మరింత పెంచుతుంది. అయొడిన్‌ లోపానికి కారణం అవుతుంది

TV9 Telugu

వీటిని ఎల్లప్పుడూ మోతాదు మేరకే తినాలి. రోజూ తీసుకోవాలనుకొనే వాళ్లు అర టీస్పూన్‌తో మొదలు పెట్టాలి. ఏ అలర్జీలూ రావడం లేదనుకుంటే అప్పుడు చెంచా వరకూ తినొచ్చు

TV9 Telugu

అది కూడా ఒకేసారి కాదు. ఉదయం, సాయంత్రం. రోజులో రెండు చెంచాలు మించి తినకూడదు. వేసవిలో.. ఇంకా తగ్గించి తినాలి. వీటిని పచ్చిగా తినడం కన్నా... డ్రైరోస్ట్‌ చేసి, పొడిచేసుకుని తినడం మేలు